గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవనీయులైన శ్రీమతి విజయమ్మ గారికి,
ప్రియతమ జగన్ కు (సమవయస్కులము కాన ),
చిరంజీవి నారా లోకేష్ బాబుకు,
గౌరవనీయులైన శ్రీమతి విజయమ్మ గారికి,
ప్రియతమ జగన్ కు (సమవయస్కులము కాన ),
చిరంజీవి నారా లోకేష్ బాబుకు,
ఇదేంటి పైన ఎ ఇద్దరికో రాయాలసిన వుత్తరం నల్గురికి రాశాడేంటి
వీడికి తిక్క,అని అనుకోకండి నాకొక లెక్కవుందండి బాబు. గత వారం పార్లమెంటు
లో తెలుగు జాతికి జరిగిన అవమానం తట్టుకోలేక ఈ వుత్తరం రాయవలసి వచ్చింది.
నేను చెప్పే ఈ వ్యథ ను అర్థం చెసుకొండి.ఇంత వరకు మీరు పరస్పరము కత్తులు
నూరుకుంటూ, ఒకరి పై ఒకరు దూషణలు చేసుకుంటున్న అదను చూసి డిల్లీ లో వున్న
ముగ్గురమ్మలు కలిసి ఎంతో దివ్యంగా ఈ త్రిలింగ దేశాన్ని రెండు భాగాలు
చెసారు. ఇందు లో మీ తప్పు ఏమి లేదు అని నమ్మిన వాడిని. మీలో ఒకరు తెలంగాణా
కావాలని వుత్తరం ఇచ్చారనో లేక ఇంకొకరు బెయిల్ కోసం కాంగ్రెస్ కు సహాయం
చేస్తున్నారానో అంటూ ఈ రోత పత్రికలు (రెండు వైపులూ ), ఒకరికి సింగపూర్ లో
హోటల్ వుందని, ఇంకొరు మారిషస్ కు డబ్బులు పంపారని మీ మీద ఏదో రాయవచ్చు మన
న్యూస్ పెపర్లన్ని వొట్టి గ్యాస్ పేపర్ లు ఏదో వాళ్ళ జీవన భ్రుతి కోసం అలా
రాస్తూవుంటాయి. తిన్నారో, తినలేదో అరిగిందో,అరగలేదో ఏదో అయిపొయింది
రాష్ట్ర విభజన ముఖ్యంగా కాంగ్రెస్ అనే ఒక దుష్ట శక్తివల్ల, డిల్లీ లో
కూర్చొని పల్లెల్లో వుండే అమాయక జనాల్ని మోసం చేసేవారి వల్ల. ,పైన(డిల్లీ )
వారికి భజన చేసే వారి వల్ల ఈ విభజన జరిగింది . మీ ఇద్దరి లో ఎవరు పవర్ లో
వున్నా ఈ విభజన జరిగేది కాదు. మీ అందరికి కాంగ్రెస్ గురించి చెప్పే స్థాయి
నాకు లేకపోవచ్చు ఎందు కంటే మీ రెండు కుటుంబాలు ఒకప్పుడు అక్కడే వుండేవి.
మీరు వుభయులు డెబ్బయ్యో దశకంలో మంచి మిత్రులు కూడా (ఫోటోలు పెట్టాను గుర్తు
తెచ్చుకోండి).
రెండు అంటున్నాను మీరు ఇరువురు మేము అభిమానించే విలక్షణ
నటుడు, ముక్కు సూటిగా ధైర్యంగా మాట్లాడే,కంచు కంఠం మంచు మోహన్ బాబు ద్వారా
బందువులు కదా. కాబట్టి మీరు ఒకే కుటుంబము. మీరే కాదు మేము, మీరు అందరమూ
ఒక తెలుగు కుటుంబము. కాని మన కర్మ ఏంటో తెలుగు కుటుంబము ప్రాంతాలవారీగా,
కులాల వారిగా విడి పొయాము. బ్రహ్మణులని,రాజులని, రెడ్లు అని, కమ్మలని,
కాపులని,వెలమలని బలి జలని ఇంకా ఎన్నో ఇలా,అలా అని చెప్పుకుంటాము కాని
తెలుగువారని చెప్పుకోము మనకు భాష దగ్గర కొంచం సిగ్గు ఎక్కువ. వచ్చి రాని
ఇంగ్లిషు లో మాట్లాడితే గౌరవము అని అనుకునే వెర్రి వాళ్ళం, ఇంకా ఎన్నో
వర్గాలుగా విడిపొయాము, పోతూనే ఉంటాము. మంచి చెడ్డలు రెండే కులములు మంచి
ఐనది మాల అయితే మాల నెనగుదున్ అన్న మహాకవి గురజాడ జాడ మరచిపొయాము.
ఇండియాలోనే కాదండి తెలుగు వారు ఎక్కడి కెళ్ళిన (ప్రపంచంలో) ఇలానే వుంటారు,
అంతర్జాలం లో (ఇంటర్నెట్) కూడా తిట్టుకుంటూ బ్రతుకుతారు (ఈ-తన్ను కోవడం
ఇంకారాలేదు). ఇదేంటో అర్థమే కాదు. ఇంత సుందరమైన భాష మనల్ని ఇంట బయట కూడా
ఒకటి చెయలెకపొయింది ఇది భాష తప్పు కాదు మన భావాల తప్పు. . మనకు అభిప్రాయ
భేదాలుండ డం లో తప్పులేదు అది ఒకరినోకరిని అసహ్యించుకొనే స్థితికి
తీసుకొపొరాదు. ఒక చిన్న యాస (తెలంగాణా), కొంతమంది రాజకీయ నిరుద్యోగుల ఆశ ఈ
భాషను రెండు రాష్ట్రాలుగా వెరుచెయగలిగిన్ది. ఇంక ఆ విభజన గురించి
మాట్లాడను ఎందుకంటే అది గతజల సేతు భంద నము. ఇప్పుడు చెప్పేదేమిటంటే మీరు
ఇరువురు ఒకటి కావాలి, ఎందుకు అని అడగొచ్చు కాంగ్రెస్ అనే దయ్యాన్ని ఆంధ్ర
ప్రదేశ్ నుండి శాశ్వతంగా తరమడానికి. కంప చెట్టు లాంటి కాంగ్రెస్ ను వేరు
దగ్గరనుండి కొట్టాలి (రాయలసీమ భాషలో "బుడం కంటా కొట్టురా" అంటాము). మీరు
ఒకరి కొకరు లోపాయికార మద్దత్తు, అంటే ఎన్నికలు ఏకగ్రీవం చేసుకోవడం, పంచాయతి
ఎన్నికల్లో లాగ (ఎక్కడ వైకాపా ఆధిక్యం వుంటే అది వారికి తెదేపా ఆధిక్యం
వుంటే అదివారికన్న మాట). ఉదాహరణకు చిత్తూర్ మీది అయితే కడప వారిదన్న మాట. ఈ
విధంగా కర్నాటక సరిహద్దులోని ఈచివర నుండి ఒరిస్సా రాష్ట్ర సరిహద్దు వరకు
ఒక్క ఎమ్మెల్లే, ఒక్క ఎంపి సీటు మాన్య కాంగ్రెస్ ప్రభువులకు దక్కకుండా
చెయ్యలి. ఎవరు గెలిచినా ఎవరు ఓడిన మీలో మీరు కలహించు కోరాదు కోట్లడుకోరాడు.
జరిగిందేదో జరిగింది, మీ మధ్య జరిగిన తగవులు మీరు మరచిపోవాలి, ఒకరు
ఇంకొకరిని నాశనం చేయడానికి తోడ్పడ రాదు. నాలుగు ఎద్దులు పులి కథ చదివే
ఉంటారని అనుకుంటాను, ఎప్పుడో ఎలిమెంటరి స్కూల్ లో చదివామని మరచిపోకండి.
ఒకసారి జగన్, ఇంకోసారి లోకేష్ మాకు ముఖ్య మంత్రులన్న మాట. మీరు ఇరువురు
మీకు దక్కిన ఎంపి లతో కేంద్రం లో ఎవరు అధికారంలో వుంటే వారికి వారికి,
మీరు ఇద్దరు తోడ్పడి ఆంధ్ర ప్రదేశ్ రావలసిన అన్ని నిధులు తేవాలి మీరు
అనుకుంటే చేయగలరు ఒక పదేళ్ళు ఇలా చేస్తే ఢిల్లీ దిమ్మ తిరుగుతుంది రాష్ట్ర
ప్రగతికి తోడ్పడు తుంది. ఇది అనైతికము,అప్రజ్యాస్వామ్యం అని విజ్ఞులు
అనవచ్చు(ఏదో మన దేశం లో పెద్ద ప్రజాస్వామ్యం వున్నట్టు) కాని లోకసభలో
కెమరాలు చీకట్లు చేసి తెలుగువారి గొంతు కోయడం కంటే మంచిదే అని నా
అభిప్రాయము. అన్నట్లు చెప్పడం మరచిపోయాను పెద్దమ్మ సోనియా, సోనియమ్మ
ప్రధాని అయితే గుండు గీసుకుంటా అని ప్రతిన బూనిన చిన్నమ్మ సుష్మ కలిసి
మెలసి తెలుగు దేశాన్ని త్రుంచి మనకు అందరికి గుండు కొట్టినప్పుడు లేని
తప్పు, భిన్న ద్రువాలు అయిన మీరు ఇరువురు కలసి మన రాష్ట్ర ప్రగతి కోసం మంచి
చేయడం లో తప్పుఎక్కడుంది ఆలోచించండి. సర్వజన హితం పుణ్యం స్వార్థ తత్వం
పాపం అని నమ్మిన వాడిని, తమిళ నాడు కంటే గొప్పగా కేంద్ర నిధులు అవ్వే
వస్తాయి. స్వర్ణాంధ్ర, హరితాంధ్ర, ఐకమత్యాంధ్ర, అన్ని ఏర్పడు తాయి. భారత
చరిత్రలో కొత్త అధ్యాయము ప్రారమ్భమవుతుంది. తమిళుడైన అన్నాదురై
చెప్పినట్లుగా "ఈ దేశానికి రెండే శత్రువులు ఒకటి బ్రిటిషువారు
(వెళ్ళిపోయారు) ఇంకోటి కాంగ్రెస్." నేను చెప్పినది మీరు చేస్తే వారు కూడా
శాశ్వితంగా ఆంధ్రా నుండి వెళ్ళిపోతారు రాహుల్ గాంధీ యువరాజు గారికి బాజా
భాజంత్రిలతో ఘనంగా "పెళ్లి" అవుతుంది (చెప్పలేము ఏజ్ బార్ అయిపొయింది,
సంభందాలు వెతకాలి, ఎవరూ ముందుకు రావడం లేదు కష్టం మనమే వెతికితే బెటర్
లేదంటే ఇంకో దేశం ఆమె వచ్చి మన నెత్తిన కూర్చుంటుంది ).
ఇంకోమాట వైకాప నుండి "కా" తీసివేస్తే ఇంకా ఆనందము, ఎందు కంటే 2004,2009 లో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లన్నీ కీర్తి శేషులు శ్రీ రాజశేఖరరెడ్డి గారి భిక్షనే, దానిలో ఏమాత్రం సందేహం లెదు. కాబట్టి వైఎస్సార్ పార్టీ చాలు ఇంక కాంగ్రెస్సు ఎందుకు మధ్యలో, వుంటే చెడ్డపేరు (ఎలెక్షన్లు దగ్గర వుండడం వల్ల ఇది కష్టము అర్థం చెసుకొగలను).
ఇంకోమాట వైకాప నుండి "కా" తీసివేస్తే ఇంకా ఆనందము, ఎందు కంటే 2004,2009 లో కాంగ్రెస్ కు వచ్చిన సీట్లన్నీ కీర్తి శేషులు శ్రీ రాజశేఖరరెడ్డి గారి భిక్షనే, దానిలో ఏమాత్రం సందేహం లెదు. కాబట్టి వైఎస్సార్ పార్టీ చాలు ఇంక కాంగ్రెస్సు ఎందుకు మధ్యలో, వుంటే చెడ్డపేరు (ఎలెక్షన్లు దగ్గర వుండడం వల్ల ఇది కష్టము అర్థం చెసుకొగలను).
చివరగా నేను రాయలసీమలో నాగలూరు అను చిన్న పల్లెలో పుట్టి అమెరికాలో స్థిరపడిన జీవ రసాయనిక శాస్త్రవేత్తను, క్యాన్సర్ కణాలను చంపడం (ఎంతైనా ఫ్యాక్షన్ ఏరియా నుంచి వచ్చాను కదా), దాని నివారణకు ప్రజలు సులభంగా, చవుకగా కొనుక్కోదగిన మందులు కనుక్కోవడం నా వృత్తి. మన రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ కూడా దేశాన్ని పీడిస్తున్న ఒక క్యాన్సర్ అని దాన్ని చంపే సులభొపాయం ఇది అని మీతో నా ఆలోచన పంచుకున్నాను. దీన్ని మీరు స్వీకరిస్తే చాలా సంతోషపడుతాను.
మీరు వినరు కొట్టుకుంటూనే వుంటారు నాకు తెలుసు అయినా నా తెలుగు తల్లి కన్నీళ్ళు చూడలేక కరిగిపోయి ఇలా రాసాను.
సదా తెలుగుతల్లి ని ప్రేమించి స్వార్థరహితంగా సేవిన్చాలనే సహృదయం వున్న
బాలు కరణం
అలబామ, అమెరికా
