నా మాజీ అభిమాన హీరో అయిన శివశంకర వరప్రసాద్ అను చిరంజీవి గారికి,
అయ్యా నేను మీకు తెలీదు మీరు మాత్రం నాకు బాగా తెలుసు ఎలాగంటే
మీ "శుభలేఖ"లు అచ్చు అయ్యి, మమ్ములను కడుపుబ్బనవ్వించిన మంచి వాడు,గొప్ప
నటుడైన పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి అల్లుడని, బాగా "స్టెప్పులు"
వేస్తారని మీ అభిమానిని అయ్యాను. బాగుంది మీరు బాగా స్టెప్పులు
వేసారు,మమ్ములను ఉర్రూతలు వూగించారు ఇది సత్యం. కాని ఎందుకో 2008 నుండి
మీరు వేసిన స్టెప్పు లన్ని తప్పు తున్నాయి మాస్టారు!. మీరు తొందరగా
ప్రభుదెవాను కాంటాక్ట్ చేస్తే మంచిదెమొ. మీ లైఫ్ ను "ఛాలెంజి" గా తీసుకొని
"స్వయంకృషి" తో పైకి వచ్చి మీ నటనా కౌశలంతో "కొదమసింహం" అయి మీ సాటి నటులలో
"ఇంద్ర "పదవిని అలంకరించి జగదేకవీరుడైన మీరు "మోసగాళ్ళు,నకిలీ మనుషులు,
కిరాయి రౌడీలు, స్టేట్ రౌడీలు,దొంగలు,అడవిదొంగలు, కొం డవీటి దొంగలు
గూండాలు కిరాతకులు రాక్షసులు" సంచరించే రాజకీయ అరణ్యం లో అడుగు పెట్టారు.
మీరు వచ్చినప్పుడు సామాజిక న్యాయం చేస్తాడని సామాన్యులు, కష్టంతో
రెక్కాడితే డొక్కాడని బ్రతుకు గడిపే "రిక్షావొడు" కూడా గంపెడాశ తో మీరు
వచ్చి కుళ్ళు రాజకీయాలు కదిగివెస్తారని ప్రజల ప్రాణా లు తీసే నవీన రాజకీయ
"యముళ్ళకు మొగుడవు" తావని, సామాన్య బీద ప్రజలకు "ఆపత్భాంధ వుడు" అవుతావు
అన్న ఆశతో మీ వైపు "న్యాయం కావాలి" అని చూసారు. నిజం మీరు అలా
కనిపించారు. బాగుంది ప్రజారాజ్యం పెట్టారు ఎన్ టి యార్ లా కాకున్నా ఒక
మోస్తరు గెలిచారు. మీ మీద అభియోగాలు వచ్చాయి. రాజకీయం లో దిగాక ఆమాత్రం
బురద అంటుకోవడం ఓకే. మీరు తిన్నారు అని, టికెట్లు అమ్ముకున్నారని అన్నారు
లోకులు పలుకాకులు దుర్మార్గులు అన్నారు. సరే మేము నమ్మలేదు మీరు లావు పెరగక
పోవడంతో మీరు తినలేదని, సిని హీరో అయిన మీరు టికెట్స్ అమ్ముకుంటే తప్పు
లేదని ("దొంగమొగుడు" లో అమ్మారు కదా మేం చూసాం సార్ ) అనుకున్నాము. కాని
కాంగ్రెస్స్ లో కలిసిపోయారు చూసారా అది మాస్టారు "రాంగ్ స్టెప్",
అక్కడనుండి విజయవాంతి (శాంతి) తో మీ డాన్సు సీక్వెన్స్ కానీ మీ డైలాగు
డెలివరీ కానీ ఏది పండలేదు,బాగుండుట లేదు. మీరు నొచ్చుకోవచ్చు బట్ ఇట్స్
ట్రూ. హాయి నిచ్చే అసత్యం కంటే జీవితాన్ని బాగు చేసే సత్యమే మంచిది
మాస్టారు. మీరే కాంగ్రెస్ లో కలిసిపోకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో
సమైఖ్యాంధ్ర హీరో లా వెలిగి పోయే అవకాశం వుండేది. మీ మాస్ అప్పిలుకు, మీకు
క్రితం వున్నా మంచి పేరుకు దుమ్ము రేపేవారనుకో (బాబు కు, జగన్ బాబుకు
కష్టమై పోయేది), ఎం చేస్తాం చెప్మా విధి వక్రీకరించింది సుమీ! పేస్
టర్నింగ్ ఇచ్చుకోవడానికి కూడా కావడం లేదు. చిన్న మెదడు చితికి పొయిన్ది.
"మగధీరుడై", "పులి" లా బ్రతికిన మీరు "హిట్లర్" (నేనటం లేదు జగన్ నే
అన్నాడు నేను విన్నాను "సాక్షి"కావాలంటే ఫోన్ చెయ్యండి) లాంటి సోనియా వద్ద
"చంటబ్బాయి" లా చేతులు కట్టుకోవడం ఏంటి సార్, "అల్లుడా మజాకా" అయిన రాబర్ట్
వాద్రా వద్ద మీరు గులాం అయిపోవడం మాకు నచ్చడం లేదు . వట్టి కోతలరాయుడై ఇటు
పెళ్లి కాక అటు ప్రధానికి పనికి రాక వట్టి పప్పుసుద్ద లాంటి రాహుల్ తో
కలసి "తోడుదొంగ" గా మారటము ఏంటి సార్ అబ్బే చాలా అసయ్యంగా వుంది. మరి
ఆంధ్రప్రదేశ్ చివరాఖరి చీప్ మినిస్టర్ గా మిమ్ములను ముగ్గులోకి
దించుతున్నరని విన్నాను. అది నిజమో ,అపద్దమో తెలియడం లేదు ఈ రోజు ఏ వార్త
నిజమో అపద్దమో తెలుసుకోవడం కష్టం అలా మారింది మన సమాజం. ప్లీజ్! చిరంజీవి
గారు వద్దండి "మృగరాజు" లాంటి మీరు నాదెళ్ళ భాస్కర్ రావు లాగ "నెలరాజో"
మూడు నెలలరాజో కారాదు. మీ "సంఘర్షణ" అర్థం చేసుకో గలను కాని వద్దుగాక వద్దు
ఈ రాజకీయాలకు స్వస్తి పలికి ఇంకా పగలకుండా మిగిలిన మీ పిచ్చి అభిమాన
హృదయాలలో "అందరివాడు" నటనలో వేరే హీరోలకు అందనివాడులా "చిరంజీవి"లా
చిరకాలం నిలిచిపోవాలని సహృదయం తో కోరుకుంటున్నాను
కాబట్టి నేను చెప్పే దేమిటంటే నా వుత్తరం చదివితే మీకే
తెలుస్తుంది మీ సినిమాలు ఎంత బాగా చూసానో అని, ఇంతచేప్పినా నా మాట వినకుండా
మీరు చీప్ మినిస్టర్ అయ్యారో అది మీ ఖర్మ. అప్పుడు మీ సినిమాల టికెట్స్ పై
పెట్టిన డబ్బు (మీకు చేరింది పంపిణి దారుల ద్వారా) ఎలాగు అడగలేను నేనంత
చీప్ కాదండి , ఏదో దేవుడి దయవల్ల,పెద్దల ఆశీర్వాదం వల్ల ఇప్పుడు ఆర్థికంగా
నిలదోక్కుకున్నాను. కాని మీ మీద వేస్ట్ చేసిన కాలం (చాలా విలువైనది అని
విజ్ఞుల అభిప్రాయం, అని విన్నాను సినిమాలు చూసే సమయం లో నాకు తట్టలేదు ),
మీ పై అభిమానంతో పారేసుకున్న నా గుండెను వెనక్కిమ్మని కొరుతున్నాను.
నన్ను "చూడాలని వుంది" అని అని పిస్తే "స్నేహం కోసం"
కాంటాక్ట్ చెయ్యండి బుక్స్ పారేసి పేస్ బుక్ లో మీకోసం చూస్తూ వుంటాను (ఇది
వేరే టైం వేస్టేమో!)
మీ రాజకీయ జీవితం తో రాజీ పడలేని ఒక పిచ్చి మాజీ అభిమాని
బాలు కరణం

No comments:
Post a Comment